103 మంది ఆటగాళ్లు ఆడిన ఫుట్ బాల్ చూశారా..?

SMTV Desk 2018-01-10 12:21:50  foot ball match,103 players, school, japan, yamaguchi

టోక్యో, జనవరి 10 : సాధారణంగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ అంటే ఒక జట్టులో ఎంత మంది ఆడతారు అంటే ఎవరైనా 11 మంది అని చెప్తారు. ఈ లెక్కన ఇరు జట్లలో 22 మంది మైదానంలో ఉండాలి. కానీ 103 మంది పాల్గొన్నారు. ఏంటి ఆశ్చర్య పోతున్నారా..? ఇది నిజమే.. ఎక్కడ అని చూస్తున్నారా.. అయితే ఇది చదివేయండి.. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జపాన్‌లోని ఒక పాఠశాలలో విద్యార్ధులతో ఫుట్ బాల్ పోటీ నిర్వహించారు. ఇందులో జపాన్‌ తరఫున అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే ముగ్గురు ఆటగాళ్లు హొటారు యమగూచి, హిరోషి కియోటకే, యోసుకి ఇడిగూచి ఓ జట్టుగా బరిలోకి దిగారు. ప్రత్యర్ధి జట్టుగా పాఠశాల విద్యార్ధులు 100 మంది పాల్గొన్నారు. పది మంది చిచ్చర పిడుగులు గోల్ పోస్ట్ వద్ద ఉండగా, స్టేడియంలో 30-30-30 గా ఏర్పడిన విద్యార్ధులు బంతిని ఆపేందుకు శతవిధాల ప్రయత్నించారు. కానీ ముగ్గరు ఆటగాళ్లు చివరకు గోల్‌కొట్టి వారిపై విజయం సాధించారు.