జీఎస్టీ ప్రారంభానికి గొప్ప సన్నాహాలు

SMTV Desk 2017-06-20 18:52:29  GST, Finance Minister Arun Jaitley, july 1st ,Promotion, amithabachchan,Popular badminton player PV Sindhu

న్యూఢిల్లీ, జూన్ 20 : కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని ఈ నెల 30న అర్ధరాత్రి ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947, ఆగస్టు 15న అర్ధరాత్రి అధికార బదిలీ జరిగినట్టుగానే పాత పన్నుల విధానంలో జీఎస్టీని ఆర్భాటంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. కేరళ, జమ్మూ-కశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాలన్నీఎస్ జీఎస్టీకి ఆమోదం తెలిపారు. కేరళ ప్రభుత్వం కూడా ఈ వారంలోనే ఎస్‌జీఎస్టీకి ఆమోదం తెలుపనుదన్నారు. దేశంలో పన్నుల వ్యవస్థ ప్రారంభానికి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌ను వేదికగా చేసుకోవడం ఇదే మొదటిసారి అంటూ అధికార వర్గాలు తెలిపారు. ఈ నెల 30వ తేదీ అర్ధరాత్రి నుంచే జీఎస్టీని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికార వర్గాలు తెలుపుతూ, ఈ నెల 30న రాత్రి 11 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమం అర్ధరాత్రి వరకు కొనసాగుతుందని పేర్కొన్నాయి. జీఎస్టీ ప్రారంభానికి సూచనగా ఒక పెద్ద గంటను మోగిస్తారని వెల్లడించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ కీలక ఉపన్యాసం చేయనున్నారు. మాజీ ప్రధాన మంత్రులు మన్మోహన్ సింగ్, హెచ్‌డీ దేవెగౌడ వేదికను అలంకరించనున్నారు. జూలై 1నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రచారకునిగా ప్రముఖ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను ప్రభుత్వం నియమించారు. ఇప్పటికే 40 సెకన్ల నిడివిగల వీడియోను ఆయనపై చిత్రీకరించారు. జాతీయ పతాకంలోని మువ్వన్నెల రంగులు జాతిని ఐక్యం చేస్తున్నట్టుగానే జీఎస్టీ కూడా దేశాన్ని ఏకం చేస్తుందని అమితాబ్ ఆ వీడియోలో వివరించారు. ఇంతకుముందు ప్రముఖ బ్యాడ్‌మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ జీఎస్టీ ప్రచారకురాలిగా వ్యవహరించారు. ఈ మేరకు జీఎస్టీ ద్వారా ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని తెలిపారు.