ఓప్రా ను నేను ఓడించగలను : ట్రంప్

SMTV Desk 2018-01-10 11:35:19  america president trump, sensational comments on comments on oprah winfrey.

వాషింగ్టన్, జనవరి 10 : ప్రముఖ అమెరికన్‌ టెలివిజన్‌ వ్యాఖ్యాత ఓప్రా విన్‌ఫ్రే 2020 లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నారా..? అనే ప్రశ్నకు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇటీవల జరిగిన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఓప్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేసే అవకాశం ఉందని పరోక్షంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ.. "నాకు ఓప్రా విన్‌ఫ్రే బాగా తెలుసు. ఆమె అంటే నాకు చాలా గౌరవం. 2020 అధ్యక్ష ఎన్నికల్లో తను పోటీ చేయదని అనుకుంటున్నా. అయినా నేను ఆమెను ఓడించగలను. ఆమెతో పోటీ పడటం ఫన్నీగా ఉంటుంది" అని తెలిపారు. కాగా ఇదే విషయంపై వైట్‌హౌస్‌ ప్రతినిధి సారా శాండర్స్ మాట్లాడుతూ.. "రానున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఎవరు పోటీ చేస్తారన్న విషయంపై నేను మాట్లాడను. ట్రంప్ మాత్రం ఆలోచిస్తారు. ఓప్రా ఒక సక్సెస్‌ఫుల్‌ మహిళ కావొచ్చు కాని ఆమె సిద్దాంతాలు నాకు నచ్చవు" అంటూ వెల్లడించారు.