సహారా ఎడారిని కమ్ముకున్న మంచు దుప్పటి...

SMTV Desk 2018-01-09 18:32:06  Aljiriya, Sahara Desert,

అమెరికా, జనవరి 9: మంచి నీరు కూడా దొరకని సహారా ఎడారి ప్రాంతం పూర్తిగా మంచుతో నిండి పోయింది. అదేంటి అనుకుంటున్నారా.. ఉత్తర అమెరికా, కెనడా ప్రాంతాలు హిమపాత౦తో ముంచేత్తాయి. ఎర్రటి ఇసుక తిన్నెలన్నీ 16 అంగుళాల మేర మంచుతో కప్పబడి ధ్రువ ప్రాంతాలను తలపిస్తున్నాయి. సహారాకు గేట్ వేగా పిలువబడే ఆల్జీరియాలోని ఐన్ సెఫ్రా పట్టణానికి సమీపంలో ఉన్న ఎడారిని మంచు కప్పేసింది. ఈ విధంగా మంచు కురవడం గత 37 సంవత్సరాల్లో నాలుగోసారి.