తెలంగాణలో విదేశీ ఫలం...

SMTV Desk 2018-01-09 17:08:03  Telangana state, Foreign fruit Dragon Fruit

హైదరాబాద్, జనవరి 9 : తెలంగాణ రాష్ట్రంలో విదేశీ ఫలమైన డ్రాగన్ ఫ్రూట్ అందుబాటులోకి వచ్చింది. ఈ డ్రాగన్ ప్రూట్ ను తెలుగులో గులాబీ పండు అంటారు. ఈ పండు పెంపకం ఎక్కువగా విదేశాల్లో కొనసాగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో కూడా ఈ డ్రాగన్ ప్రూట్ పెంపకాన్ని ఉద్యానశాఖ ప్రోత్సహిస్తోంది. అయితే, చైనాలో డ్రాగన్ ఫ్రూట్ గా పిలవబడే ఈ పండును అదే అమెరికాలో అమెరికన్ బ్యూటీ అని అంటారు. ఈ మేరకు విదేశీ ఫలాన్ని ఉద్యానవన శాఖ తెలంగాణ రైతులకు పరిచయం చేస్తుంది. జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీలో ప్రయోగాత్మకంగా డ్రాగన్ పండును సాగు చేస్తున్నారు. భువనేశ్వర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్, మిజోరంలోని డైరెక్టర్ ఆఫ్ హార్టి కల్చర్లో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. గతంలోనూ ఉద్యానశాఖ బేర్ యాపిల్‌ను తెలంగాణ యాపిల్ గా పేరుపెట్టి రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ డ్రాగన్ ప్రూట్‌ను సాగు చేస్తున్నారు. మిర్యాలగూడలో రవి అనే రైతు 15 ఎకరాల్లో డ్రాగన్ ప్రూట్‌ను సాగు చేస్తున్నారు. క్యాక్టె ప్యామీలికి చెందిన డ్రాగన్ ప్రూట్ డయాబెటిక్, బీపిలను కంట్రోల్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోను ఈ ఫలం ఎంతగానో ఉపయోగపడుతుందట.