డోప్ టెస్ట్ లో విఫలమైన టీమిండియా క్రికెటర్‌..

SMTV Desk 2018-01-09 16:57:50  doping test, yusuf pathan, bcci, ipl- 11season

ముంబై. జనవరి 9 : భారత్ జట్టు హార్డ్ హిట్టర్ యూసుఫ్ పఠాన్ కు బీసీసీఐ షాకిచ్చింది. నిషేధిత ఉత్ప్రరకం ‘టెర్బుటలైన్‌’ (దగ్గు మందుకు సంబంధించింది) వాడినట్లు తేలడంతో బీసీసీఐ అతనిపై ఐదు నెలల నిషేధం విధించింది. గతేడాది ఓ దేశీవాళి టీ-20 మ్యాచ్‌ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో యూసఫ్‌ నిషేధ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు వెల్లడయ్యింది. ఒకవేళ ఆటగాడు ఆ డ్రగ్‌ను అనుకోని పరిస్థితిలో తీసుకోవాల్సి వస్తే మాత్రం అందుకు అధికారులు అనుమతి తప్పనిసరిగా ఉండాలి. కానీ, పఠాన్‌ గానీ, టీం డాక్టర్‌ గానీ ఈ విషయాన్ని అధికారులకు తెలపలేదు. ఆగస్టు 15 నుంచి నిషేధాన్ని పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ జనవరి 14తో అది ముగియనున్నట్లు వెల్లడించింది. దీంతో ఈ నెల 27, 28 జరిగే ఐపీఎల్- 11 సీజన్ వేలానికి అందుబాటులో ఉన్నాడు. ఇంతకు ముందు 2012లో ఐపీఎల్‌ ప్రదీప్‌ సంగ్వాన్‌ కూడా ఇలాగే డోపింగ్‌కు పాల్పడి 18 నెలల నిషేధం ఎదుర్కున్నాడు.