ధోని రికార్డు అధిగమించిన సాహా..

SMTV Desk 2018-01-09 14:53:59  wriddhiman saha, test, indian crickter, dhoni, catches record ,

కేప్‌టౌన్, జనవరి 9 : టీమిండియా టెస్ట్ వికెట్ కీపర్ వృద్ధమాన్ సాహా తాజాగా సఫారీలతో జరిగిన టెస్టు మ్యాచ్ లో రికార్డు సృష్టించాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి పది క్యాచ్ లు అందుకున్నాడు. ఇంతకు ముందు ధోని 2014లో ఆస్ట్రేలియాపై తొమ్మిది క్యాచ్‌లతో నెలకొల్పిన రికార్డును అతను అధిగమించాడు. మొత్తంగా చూసుకుంటే ప్రపంచ క్రికెట్ లో జాక్ రసెల్‌ (ఇంగ్లాండ్‌), డివిలియర్స్‌ (దక్షిణాఫ్రికా) చెరో 11 క్యాచ్‌లతో ఉమ్మడిగా ప్రథమ స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఉన్న బాబ్‌ టేలర్‌, గిల్‌క్రిస్ట్‌ (ఆస్ట్రేలియా)లను సాహా సమం చేశాడు. సాహా 32 టెస్టుల్లో 75 క్యాచ్‌లు అందుకుని, 10 స్టంపింగ్‌లు చేశాడు.