అమరావతికి రైల్వే కనెక్టివిటీ పెంచండి : ఏపీ ఎంపీలు

SMTV Desk 2018-01-09 14:40:45  Railway meetings, ap mps, pending projects,

అమరావతి, జనవరి 9 : రైల్వే అధికారుల తీరుపై ఏపీ ఎంపీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బడ్జెట్ పేపర్లు సిద్దమవుతున్న సమయంలో ఇలా మీటింగులు పెట్టడం ప్రయోజనం ఏంటి అని ప్రశ్నించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ ఏపీకి చెందిన ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి టీడీపీ, వైసీపీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, రైళ్ల ప్రతిపాదనలపై ఎక్కువగా చర్చించారు. రాయలసీమ నుండి అమరావతికి రైల్వే కనెక్టివిటీ పెంచడమే కాకుండా అదనపు రైళ్లు వేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య రైల్వే నుండి ఆదాయం వస్తున్నా అందుకు తగ్గట్లుగా రైళ్లు రావడం లేదంటూ నిట్టూర్చారు.