సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన తప్పనిసరి కాదు: సుప్రీం

SMTV Desk 2018-01-09 14:35:02  national anthem, theaters, supreem court

న్యూ డిల్లీ, జనవరి 09: సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన తప్పనిసరి చేస్తూ గతంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుండి దేశంలో అన్ని సినిమా హాళ్లలో సినిమా ప్రదర్శన ముందు జాతీయ గీతాలాపన చేస్తున్నారు. కాగా ఈ నిర్ణయం పై సమీక్షించాలని సుప్రీంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో సుప్రీం తన ఆదేశాలను పునః సమీక్షి౦చి౦ది. సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన తప్పనిసరి కాదని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇది ఆ సినిమా హాళ్ల యాజమాన్యాల విచక్షణపై ఆధారపడి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.