అవసరం మేరకు అపాయింట్‌మెంట్‌ : జేసీ

SMTV Desk 2018-01-09 14:14:36  Railway zone, mp jc divaakar reddy, comments on mps.

విజయవాడ, జనవరి 9 : రైల్వేజోన్‌పై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మోదీపైనే ఉందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ. పార్లమెంట్ లో ఎంపీల పరిస్థితి పప్పులో కరివేపాకులా చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేయి ఎత్తమంటే ఎత్తాలి, దించమంటే దించాలి అన్న చందానా తయారైంది పరిస్థితి అన్నారు. ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికు ప్రధాని మోదీ అవసరం మేరకు మాత్రమే అపాయింట్‌మెంట్‌ ఇస్తున్నారని తెలిపారు.