హెలికాప్టర్‌ను తీసుకువెళ్లిన మరో హెలికాప్టర్‌!

SMTV Desk 2018-01-09 12:51:28  Technical error for helicopter Another helicopter that helped japan

టోక్యో, జనవరి 9 : సాధారణంగా పడిపోయిన వాహనాలను తరలించేందుకు మరో వాహన సహాయం తీసుకుని వారిని తరలించడం గమనిస్తూనే ఉంటాం. కానీ, ఏకంగా ఓ హెలికాప్టర్‌ పడైపోతే దాన్ని మరో హెలికాప్టర్‌ మోసుకెళ్లిన దృశ్యం జపాన్‌లోని ఒఖినావా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ హెలికాప్టర్‌ కు సాంకేతిక లోపం తలెత్తడంతో సముద్రం సమీపంలో ల్యాండైంది. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న అమెరికా తీర ప్రాంత దళాలు మరో పెద్ద హెలికాప్టర్‌ను భరిలోకి దించాయి. పాడైపోయిన హెలికాప్టర్‌ను పరిశీలించిన దళాలు సాంకేతిక లోపంగా గుర్తించి కింద స్టాండ్‌కి పాడైపోయిన హెలికాప్టర్‌ను తాడుతో కట్టి తరలించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.