సేల్ఫీ దిగుతూ అనంతలోకాలకు..

SMTV Desk 2018-01-09 12:26:05  selfie, Southern turkey, Urfa Cajil,

టర్కీ, జనవరి 9: ఈ మధ్యకాలంలో సేల్ఫీల ప్రభావం ఎంత వరకు దారి తీస్తుందో తెలియాలంటే ఈ వార్తను చదవండి. ఆఖరికి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఈ యువకుడు దిగాలనుకున్న సేల్ఫీ అందరికీ ఓ పాఠంలా మారాలి. టర్కీకి చెందిన హలిల్‌ అనే వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి దక్షిణ టర్కీలోని ప్రముఖ ఉర్ఫా కాజిల్‌కు వెళ్లాడు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న 50 మీటర్లు ఎత్తైన కొండపైకి ఎక్కి సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. సెల్ఫీ హడావుడిలో చూసుకోకుండా కొండపై కాలు పెట్టడంతో జారి పడిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. హలిల్‌ సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు అతని స్నేహితులు వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.