పాక్ కు వత్తాసు పలికిన చైనా..

SMTV Desk 2018-01-09 11:03:00  pakisthan, chaina, america, terriosm issue,

బీజింగ్, జనవరి 9 : ఉగ్రవాదం ప్రపంచ దేశాలకు కోరక రాని కొయ్యగా పరిణామిస్తుంది. ఇప్పటికే అన్నిప్రధాన ప్రాంతాల్లో వీటి మూలాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ రాక్షస మూకలను నిర్మూలించడానికి ప్రపంచ దేశాలు అన్ని ఒకే తాటిపై నిలిచి పరస్పర సహాయ సహకారాలు అందించుకోవాలి. తాజాగా పాకిస్తాన్ ఉగ్రవాదం విషయంలో చేస్తున్న కపట నాటకాన్ని గ్రహించిన అగ్రరాజ్యాధినేత ట్రంప్ వారికి సైనిక సహకారాన్నినిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో చైనా పాక్ కు వత్తాసు పలుకుతుంది. ఈ సందర్భంగా విదేశాంగ ప్రతినిధి లుకాంగ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.." ఉగ్రవాదం విషయంలో పాక్ ఇప్పటికే చాలా త్యాగాలు చేసింది. ఒక దేశాన్ని మరో దేశం తప్పుబట్టే బదులు పరస్పరం సహకరించుకుంటే ఉగ్రవాదాన్ని లేకుండా చేయవచ్చు. అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు అన్ని దేశాల సహకారం ముఖ్యం " అని వ్యాఖ్యానించారు.