సినారె అస్థికల నిమజ్జనం

SMTV Desk 2017-06-20 17:02:54  Dr. Singerreddy Narayana Reddys ashes,Immersion, krishnariver

ఇటిక్యాల, జూన్ 20 : ప్రముఖ రచయిత, కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 29, 1931 - జూన్ 12, 2017) న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామము హనుమాజీపేట్లో జన్మించారు. తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. 1990 లో యుగోస్లేవియా లోని స్రూగాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నారు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే. విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది. అంతటి గొప్ప వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో భాదపడుతూ జూన్ 12న తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆయన అస్థికలు వారి కుటుంబ సభ్యులు సోమవారం రోజు జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలోని బీచ్ పల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. ఆ రోజు నిర్వహించే కర్మకాండలో భాగంగా శాస్రోక్తంగా అభిషేకం నిర్వహించిన కుటుంబ సభ్యులు సినారె మనమడు చైతన్యరెడ్డితో కృష్ణానదిలో నిమజ్జనం చేయించారు. అతని వెంట నారాయణరెడ్డి పెద్ద అల్లుడు భాస్కర్ రెడ్డి, రెండో కూతురు యమున, ఆమె భర్త సురేందర్ రెడ్డి పలువురు ఉన్నారు.