రాజ్యసభకు ముగ్గురు ఆప్‌ అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక

SMTV Desk 2018-01-08 17:13:19  aap, three mp, rajyasabha, elected

న్యూఢిల్లీ, జనవరి 08: కేంద్రపాలిత డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 గెలిచి సంచలనం సృష్టించింది ఆమ్‌ ఆద్మీ పార్టీ. కాగా ఆప్‌కి చెందిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభ సభ్యులుగా పోటీ లేకుండా ఎన్నికయ్యారు. సంజయ్‌ సింగ్‌, సుశీల్‌ గుప్తా, ఎన్‌.డి.గుప్తాలు సోమవారం రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరికి ఎన్నికల కమిషన్‌ తరపున రిటర్నింగ్‌ అధికారి నిధి శ్రీవాత్సవ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ ఎన్నికతో మొదటిసారి ఆప్ రాజ్యసభలోకి అడుగుపెట్టింది.