ముగిసిన సఫారీల రెండో ఇన్నింగ్స్..

SMTV Desk 2018-01-08 16:47:34  india, south africa, 1 st test, cap town

కేప్ టౌన్, జనవరి 8 : కేప్ టౌన్ లో జరుగుతున్న భారత్-సౌతాఫ్రికా టెస్టులో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 41.2 ఓవర్లు ఆడి 130 పరుగులకే ఆలౌటైంది. భారత్ పేస్ దళం సఫారీలను తక్కువ స్కోర్ కే పరిమితం చేసింది. భారత్ బౌలర్లలో షమీ, బుమ్రా, మూడు వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్, పాండ్య రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. ఒక వైపు డివిలియర్స్ (35) ఒంటరి పోరాటం కొనసాగించాడు. అయితే మళ్లీ బుమ్రా బౌలింగ్ లో భువనేశ్వర్ కు క్యాచ్ ఇచ్చి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. దీంతో 208 పరుగుల లక్ష్యాన్ని ప్రోటీస్ భారత్ కు నిర్దేశించింది. ఇప్పుడు భారమంతా టీమిండియా బ్యాట్స్ మెన్ ల ప్రదర్శన పై ఆధారపడి ఉంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 286 పరుగులకే ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్ అరభించిన విరాట్ సేనను హార్దిక్ పాండ్య 93 ఆర్ధ శతకంతో ఆదుకున్నాడు. దీంతో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 209 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.