చివరి యాషెస్ టెస్ట్ ఆసీస్ వశం..

SMTV Desk 2018-01-08 14:52:12  ASHES TEST, AUSTRALIA WON, ENGLAND, STEVE SMITH,

సిడ్నీ, జనవరి 8 : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ చివరి టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ జట్టుపై ఇన్నింగ్స్‌ 123 పరుగులతో ఘన విజయం సాధించింది. దీంతో ఆసీస్ సిరీస్ ను 4-0 తో కైవసం చేసుకుంది. ఇంతకు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు ఆసీస్ పేసర్ కమిన్స్ దెబ్బకు తొలి ఇన్నింగ్స్ లో 346 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆసీస్‌ బ్యాట్స్‌మెన్లు డేవిడ్‌ వార్నర్‌(56), ఉస్మాన్ ఖవాజా(171), స్మిత్‌(83), షాన్‌ మార్ష్‌(156), మిచెల్‌ మార్ష్‌(101) రాణించారు. దీంతో ఆస్ట్రేలియా 649/7 లు ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బ్రిటిష్ జట్టు మళ్లీ కమిన్స్ దెబ్బకు 180 పరుగులకే ఆలౌటైంది. రెండు ఇన్నింగ్స్ లో ఎనిమిది వికెట్లు తీసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన కమిన్స్ ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. సిరీస్ ఆసాంతం చక్కటి ప్రదర్శన చేసి, జట్టుని విజయపథం వైపు నడిపించిన ఆస్ట్రేలియా సారథి స్మిత్ ‘మ్యాన్ అఫ్ ది సిరీస్’ దక్కించుకున్నాడు. ఈ విజయంతో ఆసీస్, టెస్ట్ ర్యాంకింగ్స్ లో 104 పాయింట్లతో మూడవ స్థానానికి చేరుకుంది. ఇంగ్లండ్ 99 పాయింట్లతో ఐదో స్థానంలోకి పడిపోయింది. 124 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుంది.