కొత్తిమీర‌ వల్ల లాభాలు ఏంటో తెలుసా..!

SMTV Desk 2018-01-07 17:08:01  coriander, profits, uses, taste, health

హైదరాబాద్, జనవరి 07: కొత్తిమీర కేవలం రుచికి, సువాసన కోసమే అనుకుంటే పొరపాటు పడినట్టే. కొత్తిమీర‌ను మాంసాహారంతో పాటు నిత్యం మ‌నం ప‌లు వంట‌ల్లో విరివిరిగా ఉపయోగిస్తుంటాము. కొంద‌రు దీంతో ప‌చ్చ‌డి చేసుకుంటారు. ఇక చారు వంటి ఆహారాల్లో అయితే కొత్తిమీర లేకుండా ఉండ‌దు. ఈ క్ర‌మంలోనే కొత్తిమీర వ‌ల్ల వంట‌ల‌కు చక్క‌ని రుచి వ‌స్తుంది. దా౦తోపాటు కొత్తిమీరలో అనేక రకాల పోషకాలు, ఆరోగ్యాన్ని కలిగించే గుణాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. *కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీంట్లో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థకు, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. *ఒక గ్లాస్‌లో నీరు, మజ్జిగను సమభాగాల్లో కలిపి అందులో చెంచా కొత్తిమీర రసం, చిటికెడు జీలకర్ర కలిపి తీసుకుంటే శరీరానికి కావల్సిన విటమిన్లన్నీ లభిస్తాయి. *అజీర్ణం బాధిస్తుంటే కొత్తిమీర రసంలో జీలకర్ర, నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. * గర్భిణీలు రోజూ 2,3 చెంచాల కొత్తిమీర రసాన్ని నిమ్మ రసంతో కలిపి తీసుకుంటే కడుపులో తిప్పడం, మలబద్దకం వంటివి తగ్గిపోతాయి. * పేగుపూత, కడుపులో మంట ఉన్నవారు కొత్తిమీరను పెరుగులో కలిపి తరచూ తీసుకుంటే ఆ సమస్యలు దూరమవుతాయి. *నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు ఉన్నవారు కొత్తిమీర ఆకులను నమిలి మింగితే త్వరగా గుణం కనిపిస్తుంది. * కొత్తిమీరకు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం కూడా ఉంది.