బిగ్ బాస్ గెమ్ షోకు రకుల్ ఎంట్రీ...

SMTV Desk 2018-01-07 16:35:58  rakul preeth singh, big boss game show, salman khan

హైదరాబాద్, జనవరి 7: వెండితెరపైన అలరిస్తున్న అందాల తార రకుల్ ప్రీత్ సింగ్, బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాల్టి గెమ్ షోలో పాల్గొంటు౦దట. అంటే ఇకపై రకుల్ సినిమాలలో నటించదా..? అనే ప్రశ్నఅందరిలోనూ తలెత్తుతుంది. కంగారు పడకండి. రకుల్ పాల్గొనేది కేవలం సినిమా ప్రమోషన్ సంబంధించి మాత్రమే. తాజాగా ఈ విషయాన్నీ రకుల్ తన ఇన్‌స్ట్రాగాంలో తెలిపింది. తాను నటించిన హిందీ చిత్రం ఐయ్యారీ ప్రమోషన్‌లో భాగంగా బిగ్ బాస్ షోలో సందడి చేయనున్నట్లు పేర్కొంది. నటుడు సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ గేమ్‌ షో సంక్రాంతి సందర్భంగా ప్రారంభం కానుంది. ఇకపోతే తమిళంలో సూర్యకు జంటగా నటించే అవకాశం పోయిందనే వార్తను కొట్టే పారేసింది ఈ సుందరి. సూర్య 36వ చిత్రంలో తానే నటిస్తున్నాని, ఆయనతో నటించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పింది.