సచిన్ కూతురిని కిడ్నాప్ చేస్తానంటూ బెదిరింపులు...దొరికిన నిందితుడు

SMTV Desk 2018-01-07 16:25:31  sara tendulkar, harresement, kidnap, dev kumar

ముంబై, జనవరి 7 : ప్రస్తుత సమాజంలో మహిళల పై వేధింపులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సాధారణ వ్యక్తుల నుండి సెలబ్రిటీ వరకు వీటిని ఎదుర్కొన్నవారే. తాజాగా టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌ కూడా వేధింపులు తప్పలేదు. ఆమె‌ను వేధించిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు శనివారం (జనవరి 6) అరెస్ట్‌ చేశారు. నిందితుడు పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌కు చెందిన దేవ్‌ కుమార్‌ (32)గా గుర్తించారు. నిందితుడు తనకు సారాతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్‌ చేస్తానని సచిన్‌ ఇంటికి ఫోన్‌ చేసి చాలా సార్లు బెదిరించాడని పోలీసులు తెలిపారు. సచిన్‌ ల్యాండ్ లైన్ నంబర్‌కు 20 సార్లు ఫోన్‌ చేసి సారా గురించి అసభ్యంగా మాట్లాడినట్లు వెల్లడించారు. ఈ వేధింపులకు సంబంధించి డిసెంబర్‌ 5న బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో నమోదైంది. అయితే దేవ్ కుమార్ మానసికస్థితి సరిగా లేదని, గత కొంతకాలంగా అతడు వింతగా ప్రవర్తిస్తున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. కాగా సచిన్ కుమార్తె సారా ప్రస్తుతం ముంబైలో లేరు. విదేశాల్లో విద్యనభ్యసిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.