ఈత సరదా ముగ్గురు విద్యార్దుల బలికొంది

SMTV Desk 2017-06-20 16:30:45  students, swimming, mardgula mandalam apparaopally,

మాడ్గుల, జూన్ 20 : ఈతపై ఉన్న సరదా ముగ్గురి విద్యార్దులను బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లి గ్రామంలోని లక్ష్మినరసింహస్వామి గుండెంలో మునిగి ముగ్గురు గిరిజన బాలురు మృత్యువాత పడ్డారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు చోటుచేసుకున్నాయి. మాడ్గుల మండలం నాగిళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని కాటారాంతండాకు చెందిన కె గణేష్ (15), కె సురేష్ (15), కె మోహన్ (15) నాగిళ్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. స్కాలర్ షిప్ కోసం అప్పారెడ్డిపల్లి గ్రామంలో ఉన్న మినీ బ్యాంకు లో అకౌంట్ తీసేందుకు సోమవారం వెళ్లారు. తిరిగి ప్రయాణంలో నాగిళ్ల కు వస్తుండగా, మార్గమధ్యలో ఉన్న గుండం వద్ద స్నానం చేసేందుకు దిగారు. గణేష్ కు ఈత రావడంతో నీటిలో దూకగా, ఈత రాని సురేష్, మోహన్ కూడా గుడంలోకి దిగారు. వారు గణేశ్ ను గట్టిగా పట్టుకోవటంతో ముగ్గురు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరికు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.