కేప్‌టౌన్‌ టెస్ట్... అంతరాయం కల్పించిన వరుణుడు

SMTV Desk 2018-01-07 15:28:29  INDIA, SOUTH AFRICA TOUR, RAIN, CAP TOWN

కేప్‌టౌన్‌, జనవరి 7 : భారత్- సౌతాఫ్రికా ల మధ్య కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు వరుణుడు అంతరాయం కల్పించాడు. కేప్ టౌన్ లో ఉదయం మూడు గంటల నుండి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. వర్షం ఆగిన తర్వాత మైదానం సిద్ధం చేయడానికి రెండు గంటలు సమయం పడుతుందని స్టేడియం సిబ్బంది తెలిపారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 209 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో అల్ రౌండర్ హార్దిక్ పాండ్య (93) చెలరేగి జట్టుని ఆదుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సఫారీ జట్టు ఓపెనర్లు, మార్ర్కమ్‌ (34), డీన్‌ ఎల్గర్‌(25) మొదటిలో బాగానే ఆడారు. అయితే తర్వాత భారత్ యువ అల్ రౌండర్ పాండ్య తన బౌలింగ్ తో వీరిద్దరని పెవిలియన్ కు పంపాడు. ప్రస్తుతం ప్రొటీస్ జట్టు 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో ఆమ్లా(4), రబాడ(2) ఉన్నారు.