రైతులతో సమావేశమైన కాంగ్రెస్ నేతలు...

SMTV Desk 2018-01-07 14:59:31  congress leaders, formers meeting nijamabad dist armur

ఆర్మూర్, జనవరి 7 : నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఆలూరులో కాంగ్రెస్ పార్టీ రైతులతో ముఖాముఖీ కార్యక్రమం చేపట్టింది. పసుపు, ఎర్ర జొన్న రైతులతో సమావేశమైన కాంగ్రెస్ నేతలు సాగులోని ఇబ్బందులు మద్దతు ధర తదితర అంశాలపై రైతులతో చర్చించి, పరిష్కార మార్గాన్ని తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు రైతుల పట్ల ప్రభుత్వ వైఖరిని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. రూ. 2 లక్షల మేరకు ఒకేసారి రుణ మాఫీ చేస్తామని, పంటల బీమా ప్రీమియం రైతులకు బదులుగా ప్రభుత్వమే చెల్లిస్తుందని నేతలు హామీ ఇచ్చారు. కేంద్ర మద్దతు ధరతో సహా, రాష్ట్రం నుంచి బోనస్ ప్రకటిస్తామని తెలిపారు. నూతన విత్తన చట్టం తీసుకువచ్చి కంపెనీల మోసాలని అరికడాతమని జీఎస్టీ భారం రైతులపై పడకుండా చూస్తామన్నారు. నిజాం షుగర్స్ పరిశ్రమను తిరిగి ప్రారంభించి రైతులకు, కార్మికులకు అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పంటలకు ఇచ్చే ధరలను నేతలు రైతుల సమక్షంలో వెల్లడించారు. ఈ మేరకు సమావేశాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండా గట్టిన నేతలు నిజామాబాద్ జిల్లా నుంచి ప్రకటించిన ఎన్నికల వ్యవసాయ డిక్లరేషన్ చరిత్రలో నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.