సిమ్లా. మున్సిపల్ కార్పొరేషన్. బీజేపీ కేవసం

SMTV Desk 2017-06-20 16:15:19  simlla, bjp, cong,mouncipalcorpartion, tusday , kusumasaderit,

న్యూఢిల్లీ జూన్20: సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కొత్త మేయర్‌గా బీజేపీ బలపరిచిన కుసుమ్ సద్రేట్ ఎన్నికయ్యారు. తొలిసారి కౌన్సిలర్‌గా ఎన్నికైన సద్రేట్ మేయర్‌ కావడం విశేషమైతే, సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ గెలుచుకుకోవడం ఇదే ప్రథమం. 31 ఏళ్లు కాంగ్రెస్‌ కంచుకోటను బీజేపీ బద్దలుకొట్టిoది. ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు బీజేపీని సంబరంలో ముంచెత్తుతోంది. కాగా, మంగళవారం నాడు జరిగిన మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి 19 ఓట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 13 ఓట్లు రాగ, ఒక ఓటు చెల్లలేదు. సీపీఎం కౌన్సిలర్ శర్మ ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. కాగా, ఇండిపెండెంట్‌గా గెలిచి బీజేపీలో చేరిన రాకేష్ కుమార్ 20 ఓట్లతో డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన ఆనంద్ కౌశల్ 13 ఓట్లు గెలుచుకున్నారు. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 17 వార్డుల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 12 వార్డులు గెలుచుకుంది. ఎన్నికైన ఇద్దరు ఇండిపెండెంట్లు బీజేపీలో చేరారు. దీంతో 34 మంది సభ్యుల సిమ్లా మున్సిపాలిటీని బీజేపీ సునాయాసంగా దక్కించుకుంది.