బుమ్రా అరంగేట్రం అదుర్స్ ..

SMTV Desk 2018-01-07 12:16:01  jasprith bhmrah, ab devilliers, virat kohli, steve smith

హైదరాబాద్, జనవరి 7 : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రిత్ బుమ్రా అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా సఫారీ జట్టు టాప్ బ్యాట్స్ మెన్ డివిలియర్స్ ప్రమాదకరంగా మారుతున్నా సమయంలో, ఓ చక్కటి యార్కర్ బంతి తో ఏబీడీను పెవిలియన్ కు పంపాడు. అయితే ఇంతక ముందు తాను ఆడిన అన్ని ఫార్మాట్ ల తొలి మ్యాచ్ లో టాప్ బ్యాట్స్ మెన్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ లో ముంబై తరపున తొలి మ్యాచ్ ఆడిన బుమ్రా బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి, వన్డేల్లో ఆసీస్ సారధి స్టీవ్ స్మిత్, అంతర్జాతీయ టీ-20 ల్లో ఆస్ట్రేలియా టాప్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.