బ్రాండ్ అంబాసిడర్‌గా గజల్ శ్రీనివాస్ తొలగింపు

SMTV Desk 2018-01-07 12:00:41  Swanthandhra Mission Brand Ambassador from the post Gajal Srinivass removal

అమరావతి, జనవరి 7 : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న గజల్ శ్రీనివాస్ ను స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్‌ పదవి నుంచి తొలగిస్తునట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2017 మే 27వ తేదిన ఆయనను ప్రచారకర్తగా ప్రభుత్వం నియమించింది. లైంగిక ఆరోపణలపై అరెస్టై, జైల్లో ఉన్న ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.ఈ మేరకు పురపాలక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా శ్రీనివాస్ నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.