‘లిటిల్ మాస్టర్’ కు లేఖ రాసిన లిటిల్ బాయ్..

SMTV Desk 2018-01-06 18:34:41  sachin tendulkar, aramani boy letter, twitter, master blaster

న్యూఢిల్లీ, జనవరి 6 : సచిన్ టెండూల్కర్... పరిచయం అక్కరలేని పేరు. అభిమానులు మాస్టర్ బ్లాస్టర్, లిటిల్ మాస్టర్ ఇలా ఎన్నో పేర్లతో ముద్దుగా పిలుస్తారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇంకా చెప్పాలంటే తన ఆట ఒక చరిత్ర గా చెప్పవచ్చు. తాజాగా ఓ బుల్లి అభిమాని సచిన్ కు ఓ లేఖ రాశాడు. ఆ లేఖను మాస్టర్ బ్లాస్టర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆ చిన్నోడు లేఖలో ఎం రాసాడో తెలుసా..! అయితే ఇది చదవండి.. “ డియర్ సచిన్ అంకుల్ మీ ఈ మధ్యే ‘సచిన్‌ - ఏ బిలియన్‌ డ్రీమ్స్‌’ సినిమా చూశాను. సినిమా చూస్తున్నంతసేపు చాలా ఎంజాయ్‌ చేశాను. నువ్వు నాకు మాత్రమే కాదు మొత్తం ప్రపంచానికి స్ఫూర్తి. బాగా ఆడి ఏదో ఒక రోజు భారత్‌కు ట్రోఫీ అందించే స్థాయికి ఎదుగుతాను. అంకుల్‌ సచిన్‌.. నీ సంతకంతో కూడిన బ్యాట్‌ను అందజేసినందుకు ధన్యవాదాలు. ఇది నాకో గొప్ప బహుమతి” అంటూ ఆర్మాన్‌ అనే చిన్నారి ఈ లేఖ రాశాడు. దీన్ని ట్విటర్‌ ద్వారా పంచుకున్న సచిన్‌.. ‘బాగా కష్టపడు. నీ కలలు నిజం కావాలని కోరుకుంటున్నా’ అని వెల్లడించారు.