మంత్రి లక్ష్మారెడ్డి విద్యార్హతపై అనుమానాలు : రేవంత్‌రెడ్డి

SMTV Desk 2018-01-06 18:31:56  congress leader revanth reddy, comments to minister lakshmaareddy, for study issue.

హైదరాబాద్, జనవరి 6 : కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి.. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి విద్యార్హతకు సంబంధించిన విషయంపై విమర్శలు గుప్పించారు. ఇటీవల లక్ష్మారెడ్డి, ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్న విద్యార్హతలపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ఆయన ఒకసారి గుల్బర్బా విశ్వవిద్యాలయంలో చదివానంటూ, మరోసారి కర్నాటక విశ్వవిద్యాలయంలో చదివానని పేర్కొన్నారు. అసలు ఆ రెండింటిలో ఏది నిజమో వెంటనే తెలియజేయాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా 1981వ సంవత్సరంలో వైద్య విద్య కోసం అడ్మిషన్ తీసుకున్న లక్ష్మారెడ్డి.. 1988లో పాసయ్యానని చెప్పారు. అసలు అంత సమయ౦ ఆయన ఏ౦ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఆర్టీఏ కింద సమాచారం అడిగినా స్పందించని కర్నాటక విశ్వవిద్యాలయ హోమియోపతి కళాశాల ప్రిన్సిపల్ సంపత్ రావు.. తమ కళాశాలలోనే లక్ష్మారెడ్డి చదివారంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి చెప్పారు. దీని వెనుక ఉన్న అసలు ఆంతర్యమేమిటో బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు.