కష్టాల్లో కోహ్లీ సేన..

SMTV Desk 2018-01-06 17:55:24  india, south africa, 1st test, pandya, cap town

కేప్ టౌన్, జనవరి 6 : సౌత్ ఆఫ్రికాతో కేప్ టౌన్ లో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ సేన సఫారీ బౌలర్ ఫిలాండర్ దెబ్బకు విలవిలలాడిపోయింది. 28/3 ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ లంచ్ బ్రేక్ వరకు స్థిరంగా ఆడి 76/4 బాగానే రాణించింది. విరామం తర్వాత ప్రొటీస్ బౌలర్ ఫిలాండర్ తొలి బంతికి టీమిండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా (26), తర్వాత అశ్విన్(12) ను తన ఖాతాలో వేసుకోగా, స్టెయిన్ బౌలింగ్ లో కీపర్ సాహా (0) డకౌట్ గా వెనుదిరగాడు. 48 ఓవర్లు ఆడిన భారత్ 112 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో అల్ రౌండర్ పాండ్య(36), భువనేశ్వర్ కుమార్(0) ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలిండర్‌ మూడు వికెట్లు, డేల్‌ స్టెయిన్‌ రెండు, మోర్నీ మోర్కెల్‌, రబడా ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.