ప్రకటనలతో తప్పుదోవ పట్టిస్తే భారీ జరిమానా..!

SMTV Desk 2018-01-06 16:17:13  cosumer defence bill-2018, loksabha, ramvilas pashvan

న్యూ డిల్లీ, జనవరి 06: వాణిజ్య ప్రకటనల్లో నటించే సెలబ్రిటీలకు హెచ్చరిక. భారీ పారితోషికాలకి తలొగ్గి ప్రజలను తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనలు చేస్తే జైలు తో పాటు జరిమానా విధించే బిల్లును కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టింది. వినియోగదారుల రక్షణ బిల్లు-2018 ను కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనలు చేసేవారికి గరిష్టంగా మూడు సంవత్సరాలు జైలు, 50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. 31 ఏళ్ల నాటి పాత చట్టానికి స్వస్తి పలికి కేంద్రం ఈ కొత్త చట్టాన్ని రూపొందించింది. సెలబ్రిటీలు ప్రకటనలపై జరభద్రం.