రాష్ట్రంలో మొత్తం 2370 కాలేజీలు.. ఏఐఎస్‌హెచ్‌ఈ సర్వే

SMTV Desk 2018-01-06 15:13:03  Human Resource minister, Prakash Javadekar, higher study report,

న్యూఢిల్లీ, జనవరి 6 : 2016-17 వ సంవత్సరానికి గాను ఉన్నత విద్యకు సంబంధించిన నివేదికను కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ విడుదల చేశారు. ఈ నివేదికను పలు ఉన్నత విద్యాసంస్థలు, యూనివర్సిటీల వివరాలను సేకరించి ఒక నివేదికను సిద్దం చేసినట్లు వెల్లడించారు. మొత్తం వివరాలన్నింటిని 864 యూనివర్సిటీలు, 40,026 కళాశాలలు, 11669 స్టాండ్‌ ఎలోన్‌ ఇనిస్టిట్యూట్లలో నుండి సేకరించి ఆ నివేదికలో పొందుపరిచారు. డా.ఎన్‌.శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ మన్మోహన్‌ సాదిక్‌ నాయక్‌ ఈ సర్వేకు సహకరించారు. ఈ నివేదికను ఆధారంగా చూసుకుంటే మొత్తం తెలంగాణలో 2,370 కళాశాలలు ఉన్నాయి. అనగా ప్రతి లక్ష మందికి 59 కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. ఉన్నత విద్యలో మొత్తం 14,38,737 మంది చదువుతు౦డగా, అందులో 3,461 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు.