నడవలేకపోతున్న జయసూర్య...

SMTV Desk 2018-01-06 15:07:55  sanath jaya surya, former srilanka crickter, knee pain, colombo

కొలంబో, జనవరి 6: సనత్ జయసూర్య..ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ వెలుగు వెలిగిన దిగ్గజ ఆటగాడు. పవర్ ఫుల్ స్ట్రోక్ ప్లేతో ప్రత్యర్థి జట్లను ముచ్చెమటలు పట్టించిన ఈ లెజెండ్ ఆటగాడు ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నాడు. మోకాలి గాయం కారణంగా అతను అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం జయసూర్య త్వరలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆపరేషన్‌ చేయించుకోనున్నాడు. శస్త్రచికిత్స అనంతరం జయసూర్య కోలుకోవడానికి కనీసం నెలరోజుల సమయం పడుతుందని సమాచారం. టెస్టుల్లో 6973 పరుగులు, 98 వికెట్లతో ఆల్‌ రౌండ్‌ ప్రదర్శన చేసిన జయసూర్య వన్డేల్లో 13430 పరుగులు, 323 వికెట్లు పడగొట్టాడు. టీ20 ల్లో అతను 629 పరుగులు చేసి 19 వికెట్లు తీసుకున్నాడు. 1996లో శ్రీలంక వరల్డ్‌ కప్‌ గెలవడంలో జయసూర్య కీలక పాత్ర పోషించాడు.