తలైవా సీఎం కాలేరు : కర్ణాటక జ్యోతిష్యుడు

SMTV Desk 2018-01-06 11:52:21  rajinikanth, karnataka astrologer, sensational comments, political comments,

చెన్నై, జనవరి 6 : తమిళ తలైవా రజనీకాంత్‌.. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదంటూ కర్ణాటక జ్యోతిష్యుడు ప్రకాశ్‌ అమ్మునాయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు జ్యోతిష్యుడు మాట్లాడుతూ.. "రజనీకి సర్ప దోషం ఉన్నందువల్ల ఆయన సీఎం అయ్యే భాగ్యం లేదు. సింహ లగ్నంలో జన్మించిన రజనీని ప్రత్యర్థులెవరు పోటీ చేసి ఓడించలేరు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా పట్టించుకోకుండా ఒక పార్టీ నాయకుడిగా, "కింగ్‌మేకర్‌" గా వ్యవహరించాలి. అంతేకాకుండా సన్నిహితుల పట్ల కాస్తంతా జాగ్రత్త వహించాల్సి ఉంది. వారి వల్ల ఆయనకు చెడు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది" అంటూ పేర్కొన్నారు.