ఆ గర్భనిరోధక ఔషధంతో హెచ్‌ఐవీ..?

SMTV Desk 2018-01-06 11:14:39  Pregnancy drugs, Depat-MedroxyProzteritone acetate, HIV attack.

జొహాన్స్‌బర్గ్‌, జనవరి 6 : గర్భ నిరోధక మందుల ద్వారా మహిళల్లో హెచ్‌ఐవీ సోకే ప్రమాదముందా.? అంటే అవుననే అంటున్నాయి తాజా అధ్యయనాలు. ఈ విషయంపై తాజాగా దక్షిణాఫ్రికా పరిశోధకులు అధ్యయనాన్ని చేపట్టి ఈ విషయాన్ని వెల్లడించారు. కాని ఇందుకు గల కారణాలను మాత్రం వారు వెల్లడించలేదు. కాగా "డిపాట్‌-మెడ్రాక్సీప్రొజెస్టిరాన్‌ అసిటేట్‌(డీఎంపీఏ)" అనే ఔషధాన్ని సబ్ సహారా ఆఫ్రికా ప్రాంతంలో గర్భనిరోధక సాధనంగా ఎక్కువగా వాడుతున్నారు. ఈ డీఎంపీఏ ను 3 నెలలకు ఒకసారి సూది మందు రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఔషధాన్ని ఉపయోగించే మహిళల్లో హెచ్‌ఐవీ సోకే ముప్పు 40 శాతం పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కావున మహిళలు జాగ్రత్తపడి డీఎంపీఏలకు బదులు గర్భనిరోధక సాధనాలను వినియోగించడం ఉత్తమ౦ అని తెలిపారు.