ముర్రే దారిలోనే సెరెనా విలియమ్స్...

SMTV Desk 2018-01-06 10:41:18  serena williams, australia open, grand slam tournment, andy murray

అమెరికా, జనవరి 6 : అమెరికా టెన్నిస్ దగ్గజం సెరెనా విలియమ్స్ ఈ నెల 15 నుండి జరిగే ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ టోర్నీ నుండి వైదోలగానున్నట్లు ప్రకటించింది. దాదాపు సంవత్సరం తర్వాత ఆమె పునరాగమన కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త షాక్ కు గురి చేస్తుంది. ఇప్పటికే బ్రిటిన్ టాప్ టెన్నిస్ క్రీడాకారుడు ఆండీ ముర్రే, జపాన్ ఆటగాడు కీ నిషికోరి కూడా టోర్నీ నుండి తప్పుకోవడంతో ఆస్ట్రేలియా ఓపెన్ కళా తప్పినట్లు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్‌ నెగ్గాక మరే టోర్నీ ఆడని సెరెనా, ఆ తర్వాత ఓ పాపకు జన్మనివ్వడంతో ఆ సీజన్‌ మొత్తం ఆటకు దూరంగా ఉంది.