ఆ గెలుపులో డబ్బుదే కీలక పాత్ర : కమల్‌హాసన్‌

SMTV Desk 2018-01-05 17:44:13  rk nagar bypoll elections, dinakaran, kamal hasan,

చెన్నై, జనవరి 5 : ఆర్కేనగర్‌ ఉపఎన్నికలో దినకరన్‌ స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి 40వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ గెలుపుపై ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌.. డబ్బు ఈ గెలుపులో కీలకపాత్ర పోషించింద౦టూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టి ఎన్నికల్లో విజయం సాధించారని ఆరోపించారు. జయలలిత మరణానంతరం జరిగిన ఈ ఉపఎన్నిక భారతీయ ప్రజాస్వామ్యానికే ఒక మచ్చలాంటిదని ఓ తమిళ పత్రికలో కమల్‌హాసన్‌ ఒక ఆర్టికల్‌ రాశారు. అందులో "ఈ గెలుపు ఒక స్కాం. డబ్బుతో ఓటర్లను ప్రలోభ పెట్టి గెలిచారు. ఇది పట్టపగలే జరిగిన ఒక నేరం" అంటూ అభివర్ణించారు. కమల్ వ్యాఖ్యలపై దినకరన్ ఘాటుగా స్పందించారు. "కమల్.. వయస్సు మీద పడి అనుభవరాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఆర్కేనగర్‌ ప్రజలు ఓటు వేసింది నాకు అంటూ దాన్ని నిర్ణయించడానికి మీరేమైనా న్యాయవాదా? దేవుడా?అంటూ ప్రశ్నించారు. నా గెలుపును ఇష్టమైతే అంగీకరించండి, లేకపోతే లేదు" అంటూ ప్రతి విమర్శలు చేశారు.