ప్రధాని మోదీతో తెదేపా, బీజేపీ ఎంపీల భేటీ..

SMTV Desk 2018-01-05 16:14:46  prime minister modi, tdp, bjp mp meeting.

న్యూఢిల్లీ, జనవరి 5 : ప్రధాని మోదీతో ఏపీ కి చెందిన తెదేపా, బీజేపీ ఎంపీలు భేటీ అయ్యారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చి, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు అంశాలపై చర్చలు జరిపారు. అలాగే సీట్ల పెంపు, రైల్వేజోన్, ఇతర పెండింగ్‌ అంశాలను ప్రధానికి విన్నవించారు. కాగా ఎంపీల విజ్ఞప్తిపై మోదీ సానుకూలతను ప్రదర్శించినట్లు సమాచారం. అలాగే కష్టాలలో కూరుకుపోయిన నవ్యాంధ్ర ప్రదేశ్ ను ఆదుకోవాలని ఎంపీల౦తా మోదీకి వినతిపత్రాన్ని అందజేశారు.