సీబీఐ విచారణ అంత సులభం కాదు- ఏపీ సీఎం చంద్రబాబు

SMTV Desk 2017-06-20 13:25:10  Vishakapatnam Land litigations,AP CM Chandrababu,Smart Water Grid

అమరావతి, జూన్ 20 : విశాఖ భూముల కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వానికి ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సీబీఐ విచారణ అంత సులభంగా జరగదని, దానికి 20 సంవత్సరాల సమయం పడుతుందని తెలిపారు. మీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ విషయం పై సీబీఐ విచారణ ఎందుకు కోరారు! అని చంద్రబాబును ఒక విలేకరి ప్రశ్నించగా దానికి సమాధానంగా ఆధారాలను తీసుకువస్తే మరుసటి రోజే చర్యలు చేపడతామని సీఎం చెప్పారు. ప్రతిపక్షాలు దీనిని రాద్దాంతం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 24 ప్రాజెక్టులను 2018 మార్చి లోపు పూర్తిచేస్తామన్నారు. స్మార్ట్ వాటర్ గ్రిడ్ తయారు చేయడమే లక్ష్యమని, ప్రతిపక్షాల విమర్శలకు భయపడి ఉంటే గోదావరి నీళ్ళు కృష్ణాకు తీసుకువచ్చే వాళ్ళం కాదని సీఎం చంద్రబాబు తెలిపారు. పులిచింతల ప్రాజెక్టును ఆగస్టులో జాతికి అంకితం చేస్తామని చెబుతూ మొత్తం 24 ప్రాజెక్టులను ఎప్పుడు ప్రారంభించనున్నారో ఆయన వివరించారు. కైజాలా యాప్ ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల ఫోటోలు తీసి పంపిస్తే, వారికి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.