భారత్ తరహాలో అమెరికా మాటలు :పాక్

SMTV Desk 2018-01-05 13:55:02  america, india, pakisthan, Donald Trump, Pakistani Foreign Minister Khwaja Asif

ఇస్లామాబాద్‌, జనవరి 5 : భారత్ తరహాలో అమెరికా అధ్యక్షుడు పై డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖ్వాజా అసిఫ్‌ వ్యాఖ్యలు చేశారు. భూభాగంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని వెనువెంటనే పాక్‌కు 255మిలియన్‌ డాలర్ల సైనిక సహాయాన్ని, తాజాగా 900మిలియన్‌ డాలర్ల భద్రతా సహకారాన్ని నిలిపేశారు. దీంతో పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా అసిఫ్‌ స్పందిస్తూ...పాక్‌, అమెరికా మాటల యుద్ధంలోకి భారత్‌ను లాగారు. ట్రంప్‌ ఉగ్రవాదుల విషయంలో భారత్‌ భాషలో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పాక్‌, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఖ్వాజా దేశ భద్రతపై పార్లమెంటరీ కమిటీతో మాట్లాడుతూ... ఈ వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్థాన్‌లో అమెరికా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ట్రంప్ తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ట్రంప్‌ కూడా భారత్‌ భాషలో మాట్లాడుతున్నారని, వారి వ్యాఖ్యల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు.