కనీస నిల్వలు తగ్గించనున్న ఎస్‌బీఐ..!

SMTV Desk 2018-01-05 12:37:43  SBI, Minimum balance, dis crease,

న్యూఢిల్లీ, జనవరి 5 : ఎస్‌బీఐ తమ వినియోగదారులకు కాస్తంత ఊరట కలిగించే విషయాన్ని తెలియజేసింది. ప్రస్తుతం మెట్రో నగరాల్లో నగదు నిల్వ లక్ష్యం రూ.3000 ఉండగా.. దీన్ని రూ.1000కి తగ్గించాలని బ్యాంక్ యోచిస్తోంది. ఎస్‌బీఐ తమ పొదుపు ఖాతాల్లో తగినంత నిల్వలు నిర్వహించని ఖాతాదారుల నుంచి రూ.వేల కోట్ల ఛార్జీలు వసూలు చేసి లాభం పొందుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ మేరకు బ్యాంక్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కనీస నగదు నిల్వ నిబంధనను రూ.1000కి తగ్గించాలని భావిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.