మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వండి :ఎంపీ సీతారాంనాయక్‌

SMTV Desk 2018-01-05 11:12:57  National identity medaram jathara, MP Sitaramnaik parlament delhi

న్యూఢిల్లీ, జనవరి 5 : శీతాకాల సమావేశాల్లో భాగంగా ఢిల్లీలోని పార్లమెంట్ లో శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని తెరాస ఎంపీ సీతారంనాయక్ లోక్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా భక్తులు తరలి వచ్చే ఈ జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆయన తెలిపారు. 12వ శతాబ్దం నుంచి ఆదివాసీలు మేడారం ఉత్సవాలను నిర్వహిస్తున్నారని సీతారం అన్నారు. ఈ మేరకు అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని ఆయన సభలో పేర్కొన్నారు.