నేడే సఫారీలతో తొలి టెస్ట్..

SMTV Desk 2018-01-05 10:55:19  india, tour of south africa, 1 st test, captown

కేప్ టౌన్, జనవరి 5 : భారత్- దక్షిణాఫ్రికా ల మధ్య మూడు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా ఈ రోజు తొలి టెస్ట్ కేప్ టౌన్ వేదికగా జరగనుంది. అన్ని రంగాల్లో బలాలు పరంగా ఇరు జట్లు పటిష్టంగా కన్పిస్తున్నాయి. స్వదేశంలో అన్ని సిరీస్ లలో అప్రతిహత విజయాలతో దూకుడు మీదున్న కోహ్లీ సేన అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతుంది. అంతే కాకుండా ఇంతవరకు సౌతాఫ్రికాలో ఒక్క సిరీస్ గెలవని టీమిండియా వారి సొంత గడ్డపై సత్తా చాటాలని చూస్తుంది. ముఖ్యంగా సఫారీ పేస్ దళంను భారత్ జట్టు ఏ మేరకు నిలవరిస్తుందో చూడాలి. కాగా ఈ రోజు మధ్యాహ్నం 2గంటల నుండి న్యూలాండ్స్ మైదానంలో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.