పజిల్ ‘378’...

SMTV Desk 2018-01-04 18:57:02  csk, ipl, retention, madras, dhoni, raina

చెన్నై, జనవరి 4 : మరికొద్ది క్షణాల్లో ఐపీఎల్ ఆటగాళ్లు అట్టిపెట్టుకొనే జాబితా బయటకు రానుంది. దీనికి ముందు సీఎస్ కే జట్టు అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ఇచ్చింది. పై ఫోటో లో ‘378’ నెంబర్ బట్టి మీకు ఏమైనా క్లూ దొరికిందా..తెగ ఆలోచిస్తున్నారా..? అయితే ఇది చదవండి. పైన చిత్రంలో ఉన్న ‘3’ నెంబర్ జెర్సీ రైనాది కాగా నెంబర్ ‘7’ ధోనిది. ఇంకా మిగిలిన సంఖ్య ‘8’ జడేజా ని సూచిస్తుంది. ఇంతవరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు జడ్డు భాయ్ ని తీసుకుంటాదా..?లేదా..? అన్న సందేహాలును ఈ చిత్రం పటాపంచలు చేసింది. అంతే కాకుండా ఈ ఫోటోలో మరో విశేషం ఏమిటంటే మద్రాస్ ఏర్పడి ఇప్పటికి 378 సంవత్సరాలు అయ్యింది.