క్రిస్ లీన్ ఇన్..మాక్స్ వెల్ ఔట్...

SMTV Desk 2018-01-04 18:35:05  australia cricket, glen max well, chris lynn, england odi

మెల్‌బోర్న్‌, జనవరి 4 : ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం ఆసీస్ స్టార్ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను ఇంగ్లాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో చోటు కల్పించలేదు. ఇటీవల మ్యాక్స్‌వెల్‌ తన పేలవమైన ఆట తీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు. అతన్ని ఎంపిక చేయడానికి సారధి స్టీవ్ స్మిత్ కూడా అంతగా శ్రద్ధ చూపలేదు. మరో వైపు విద్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ లీన్ ను కమిటీ ఎంపిక చేసింది. కాగా ఆసీస్- ఇంగ్లాండ్ మధ్య ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఎంసీజీ వేదికగా ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, కమిన్స్‌, అరోన్‌ ఫించ్‌, హజల్‌వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, క్రిస్‌ లిన్‌, మిచెల్‌ మార్ష్‌, టిమ్‌ పైనీ, రిచర్డ్‌సన్‌, మిచెల్‌ స్టార్క్‌, స్టోనిస్‌, ఆండ్రూ టై, ఆడమ్‌ జంపా