ఈసారి కోళ్ల పందేల్లో పోటీపడనున్న పాక్ కోళ్లు...

SMTV Desk 2018-01-04 18:03:02  cock fight, kakinada, Godavari districts

కాకినాడ, జనవరి 4 : ప్రతి ఏటా సంక్రాంతి వస్తే చాలు ముందుగా అందరు గుర్తు చేసుకునేది కోడీ పందేలే. ఈసారి కూడా భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు, ఇంటి నిండా బంధువులతో పాటుగా గోదావరి కోళ్లతో పందేలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతుంది. అయితే, ఈసారి కోడి పందేల్లో ఓ ప్రత్యేక ఉందట. పాక్ కోళ్లతో ఈ పందేలు నిర్వహిస్తారట. పాక్ కోళ్లతో ఏంటి అనుకుంటున్నారా.. అసలు విషయంలోకి వెళితే... వేల ఏళ్ల క్రితం నుంచి వివిధ దేశాల్లో సాగుతున్న ఈ క్రీడలో.. పాకిస్తాన్ కోళ్లకు మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ మధ్య ధైవాన్, మలేషియా, ఇండోనేషియా, పాకిస్తాన్ లాంటి ప్రాంతాల నుంచి కూడా కోనసీమ పెంపకం దారులు బ్రీడ్ తెప్పించి పెంచుతున్నారు. ముఖ్యంగా కత్తులు కట్టకుండా వేసే పందాలకు పాకిస్థాన్ బ్రీడ్ కోళ్లు బాగా ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు. అందుకే ఈసారి పాక్ కోళ్లకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. కాగా, పందెంలో వీర మరణం పొందిన పుంజుల మాంసానికి చాలా డిమాండ్. వాటిని పెంచడానికి అత్యంత బలమైన ఆహారం పెట్టడంతో ఆ మాంసం రుచి ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే పందెంలో ఓడిన కోడిని దక్కించుకునేందుకు వేలం పాటలు జరుగుతాయి. పైగా సంక్రాంతి వేళ గోదావరి జిల్లాల్లో పందెంకోళ్ల మాంసం తప్ప, బ్రాయిలర్, మామూలు కోళ్ల మాంసం కూడా ముట్టుకోరు. పందెంకోడిని బంధుమిత్రులకు వ౦డిపెట్టడం అక్కడ ఓ ప్రత్యేకత. కానీ ఈ ఏడాదిలో కోడి పందేలు నిర్వహించరాదని, న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఒకవేళ నిబంధనలను కాదని వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించిన విషయం తెలిసిందే.