కళ్ళు తెరిచే కలలు కంటా : శివరాజ్‌ సింగ్‌

SMTV Desk 2018-01-04 17:58:07  maharastra cm, shivarajsingh chowhan, friends of mp conclave 2018.

భోపాల్, జనవరి 4 : ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్రమే ముందుందని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు. ఇండోర్ లో నిర్వహించిన "ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఎంపీ కాన్‌క్లేవ్‌ 2018" అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను కలలను కళ్ళు తెరిచే కంటాను. వాటిని నెరవేర్చడానికి మాత్రం చాలా కష్టపడతాను. అందుకే కావచ్చు మా రాష్ట్ర౦ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. వ్యవసాయ రంగంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్రమే ముందుంది. ఏటేటా అభివృద్ధి రెండింతలు పెరుగుతూ పోతోంది. ప్రభుత్వం అందుకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తోంది" అని పేర్కొన్నారు.