ఆయన కోసం ఓ కార్యకర్తలా పని చేస్తాను: విశాల్

SMTV Desk 2018-01-04 17:01:56  RAJANI KANTH, VISHAL, TAMIL NADU GOVERNMENT

చెన్నై, జనవరి 4: తమిళనాట రాజకీయ రంగ ప్రవేశం చేసిన సూపర్ స్టార్ రజనీ కాంత్ కు సినీ తారలు వరుసగా మద్దతు పలుకుతున్నారు. రజనీ పార్టీలో ఒకవైపు రాఘవ లారెన్స్ చేరే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు తమిళ నటుడు విశాల్ సైతం రజనీకి పూర్తి మద్దతు పలికాడు. తాజాగా విశాల్ మీడియాతో మాట్లాడుతూ.." రజనీ కోసం ఓ కార్యకర్తలా పని చేస్తానని, మొత్తం 234 స్థానాల్లో ప్రచారం చేస్తానని" అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.