దీపికా పదుకునే పెళ్ళికి ముహూర్తం రేపే..!

SMTV Desk 2018-01-04 16:28:13  DEEPIKA PADUKONE, RANVEER SINGH,

ముంబాయి, జనవరి 4: ఈ ఏడాది ప్రారంభంలోనే బాలీవుడ్ లో మరో బ్యూటి వివాహం జరగబోతుందని తెలుస్తోంది. గత కొన్ని ఏళ్లుగా దీపికా పదుకునే, రణవీర్ సింగ్ లు ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఐదేళ్ళ నుండి వీరిద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రేమ జంట కూడా గుట్టు చప్పుడు కాకుండా నిశ్చితార్ధం చేసుకోవడానికి రెడీ అయిపోయిందట. రేపు (జనవరి 5) దీపిక పుట్టిన రోజును పురస్కరించుకొని వీరిద్దరూ కలిసి శ్రీలంకకు వెళ్లారు. అక్కడ కేవలం జన్మదిన వేడుకలే కాకుండా ఉంగరాలను మార్చుకొనే తంతు కూడా జరుగబోతుందని సమాచారం. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.