కోజికోడ్, జనవరి 4 : నిత్యం అణు బా౦బులు, క్షిపణి పరీక్షలంటూ ప్రపంచ దేశాలను హడలుగొడుతున్న ఉత్తర కొరియాపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసల వర్షం కురిపించారు. కోజికోడ్‌లో జరిగిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో విజయన్ మాట్లాడుతూ.. కొరియా.. అగ్రరాజ్యం ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గకుండా అమెరికా వ్యతిరేక అజెండా అనుసరిస్తోందని కొనియాడారు. కాగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా హెచ్చరికలు పెడచెవిన పెట్టిన ఉత్తర కొరియా దాదాపు 20కి పైగా క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. అంతేకాకుండా నూతన సంవత్సర వేడుకల్లో కూడా కిమ్ అమెరికాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.