టీ-20 ర్యాంకింగ్స్...మూడో స్థానంలోనే కోహ్లీ

SMTV Desk 2018-01-04 15:51:12  icc rankings, virat kohli, colin munro, ishi sodhi,

దుబాయ్, జనవరి 4 : అంతర్జాతీయ టీ-20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా క్రికెట్ సారధి బ్యాటింగ్ విభాగంలో మూడో స్థానంలో(776) స్థిరంగా కొనసాగుతున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ-20 ర్యాంకింగ్స్ లో న్యూజిల్యాండ్ బ్యాట్స్ మెన్‌ కోలిన్ మున్రో(793) 11 స్థానాలు మెరుగుపరుచుకొని ప్రధమ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో కివీస్ ఆటగాడు ఇషి సోథీ (726) 9 స్థానాలు ఎగబాకి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. ఇక అల్ రౌండర్ విభాగంలో బంగ్లాదేశ్ క్రీడాకారుడు షకిబ్ అల్ హాసన్(353) మొదటి స్థానంలో ఉన్నాడు. భారత్ బౌలర్ బుమ్రా ఒక స్థానం కోల్పోయి 4వ స్థానంకు పడిపోయాడు. కోలిన్ మున్రో తాజాగా కరేబియన్లతో జరిగిన టీ-20 మ్యాచ్ లో సునామీ బ్యాటింగ్ తో 104 పరుగులతో సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. ఈ శతకంతో అంతర్జాతీయ టి20ల్లో మూడు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా మున్రో రికార్డు సృష్టించాడు.